నిత్యానంద ఎక్కడున్నాడో చెప్పిన శిష్యురాలు

నిత్యానంద ఆచూకీ ఆయన శిష్యురాలు బయట పెట్టారు.

Update: 2025-06-20 11:45 GMT

నిత్యానంద ఆచూకీ ఆయన శిష్యురాలు బయట పెట్టారు. ఆస్ట్రేలియా దేశానికి సమీపంలో "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస" అనే ప్రత్యేక దేశంలో ఉంటున్నారని ఆయన శిష్యురాలు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనానికి తెలిపారు. మదురై మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో జారీ అయిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మదురై ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించరాదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిత్యానంద అప్పీలు చేశారు. నిత్యానంద తరఫున ఆయన శిష్యురాలు అర్చన హాజరై వాదనలు వినిపించారు. ఆస్ట్రేలియా దేశానికి దగ్గరలో ఉన్న కైలాస అనే ప్రత్యేక దేశంలో ప్రస్తుతం నిత్యానంద నివసిస్తున్నారని ఆమె కోర్టుకు తెలియజేశారు. నిత్యానంద తరఫున కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అర్చన ధర్మాసనాన్ని కోరారు.

Tags:    

Similar News