కడలి గర్భంలో కరుణామయుడు
కడలి గర్భంలో ఏసు క్రీస్తు విగ్రహాన్ని చూడాలంటే ఇటలీకి వెళ్లాల్సిందే.
కడలి గర్భంలో ఏసు క్రీస్తు విగ్రహాన్ని చూడాలంటే ఇటలీకి వెళ్లాల్సిందే. శాన్‌ఫ్రటూసో తీరం సమీపంలోని మధ్యధరా సముద్రంలో ఉన్న కమోగ్లీలో 1954 ఆగస్టు 22న కంచుతో తయారు చేసిన 2.5 మీటర్ల ఎత్తైన జీసస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 17 మీటర్ల లోతున ఉన్న ఈ విగ్రహాన్ని నౌకాదళం స్కూబా డైవర్‌తో శుద్ధి చేయించారు. గతంలో 2003లో విగ్రహాన్ని బయటకు తీసి శుద్ధి చేసి మళ్లీ అక్కడే ఏర్పాటు చేశారు. "క్రైస్ట్ ఆఫ్ ది అబిస్" విగ్రహం నుండి క్రస్టేసియన్లను తొలగించడానికి ప్రెషరైజ్డ్ వాటర్ గొట్టాలను ఉపయోగించి శుభ్రం చేశారు. ఈ విగ్రహం ఇటలీ ఉత్తర లిగురియన్ తీరంలో పోర్టోఫినో, కామోగ్లి అనే రిసార్ట్ పట్టణాల మధ్య బీచ్ నుండి దాదాపు 300 మీటర్ల దూరంలో, దాదాపు 18 మీటర్ల లోతులో ఉంటుంది.