లారీ డ్రైవర్లకు ఏసీ క్యాబిన్ తప్పనిసరి

లారీ డ్రైవర్లకు ఊరటను కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-07-14 11:45 GMT

లారీ డ్రైవర్లకు ఊరటను కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లారీ డ్రైవర్లు క్యాబిన్ లో వేడి సెగతో పోరాటం చేస్తూ ఉంటారు. విపరీతమైన అలసటకు గురవుతూ ఉండడంతో రోడ్డు ప్రమాదా­లకు కారణమవుతూ ఉంటాయి. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకుని లారీ కేబిన్‌లలో కూడా ఎయిర్‌ కండిషన్‌ వసతి కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఏసీ కేబిన్‌తో కూడిన లారీలనే విక్రయించాలని కేంద్రం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఏసీ కేబిన్‌ ఉన్న ట్రక్కులకే రోడ్డెక్కే అనుమతి ఉంటుంది. ప్ర­ధా­న కంపెనీలు గడువు కంటే ముందే కొత్త ట్రక్కు­లను ఏసీ వసతితో అమ్మటం ప్రారంభించాయి. టాటా, అశోక్‌ లేలాండ్, భారత్‌ బెంజ్, ఐషర్‌ లాంటి ప్రధాన కంపెనీల ట్రక్కులు ఏసీతోనే వస్తున్నా­యి.

Tags:    

Similar News