తండ్రి అంటే అంతే మరి.. బస్సునే బంకర్ గా మార్చి

బతకాలనే ఆశ.. నా కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలనే పోరాటం. ఇలాంటి సమయంలోనే అతడు బస్సును పాతిపెట్టాలని అనుకున్నాడు.

Update: 2025-07-17 14:00 GMT

బతకాలనే ఆశ.. నా కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలనే పోరాటం. ఇలాంటి సమయంలోనే అతడు బస్సును పాతిపెట్టాలని అనుకున్నాడు.

అహ్మద్ అబు గనిమా దక్షిణ ఇజ్రాయెల్ లోని నెగెవ్ ఎడారిలోని ఖాషెం జనేహ్ గ్రామం లో నివసిస్తూ ఉన్నాడు. తమ దేశంపై శత్రుదేశాలు చేస్తున్న క్షిపణి దాడుల నుంచి కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఎంతగానో ఆలోచించాడు. ఓ పాత మినీ బస్సును భూమిలో పాతిపెట్టాలనే ఆలోచన వచ్చేసింది. దానిపైన ఎత్తుగా మట్టిని నింపి బస్సునే బంకర్గా మలచుకున్నాడు. దాని కిటికీ నుంచి అతని కుటుంబ సభ్యులు లోపలికి బయటకు వెళ్తూ వస్తుంటారు. అబు గనిమా ఆలోచనకు ప్రపంచం ఫిదా అవుతున్నా.. యుద్ధాలు ప్రజల జీవితాలను ఎలా తారుమారు చేస్తాయో ఇదో నిదర్శనం అని ప్రజలు వాపోతున్నారు.

Tags:    

Similar News