థార్, బుల్లెట్ ఓనర్లు అలాంటి వాళ్ళే!!

హర్యానా డీజీపీ ఓపీ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-11-10 15:00 GMT

హర్యానా డీజీపీ ఓపీ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. థార్ కారు, బుల్లెట్ బండ్లు నడిపేటోళ్లు రోగ్స్ అంటూ వ్యాఖ్యానించారు. వాహనాల తనిఖీల గురించి చండీగఢ్ మీడియాతో డీజీపీ మాట్లాడారు. పోలీసులు ప్రతి వాహనాన్ని ఆపరని, అయితే థార్ కారు, బుల్లెట్ బండ్లను మాత్రం కచ్చితంగా ఆపుతారన్నారు. ఎందుకంటే వాటిని వాడే వాళ్లందరూ రోగ్స్. మీ వెహికల్ మీ మైండ్ సెట్ ను తెలియజేస్తుంది. థార్ నడిపేటోళ్లు రోడ్ల మీద స్టంట్లు చేస్తూ ఉంటారని అన్నారు. ఇటీవల ఓ అసిస్టెంట్ కమిషనర్ కొడుకు థార్ నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. తన కొడుకును రక్షించడానికి ఆ అధికారి ప్రయత్నించాడు. అసలు ఆ కారు అసిస్టెంట్ కమిషనర్ పేరు మీదే ఉన్నది. కాబట్టి అతనే రోగ్ అని అన్నారు ఓపీ సింగ్.

Tags:    

Similar News