తెలుగోడి పవర్.. తిలక్ వర్మ

చాలా రోజుల తర్వాత భారత జట్టులో తెలుగోడు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉండడంతో తెలుగు ప్రజల్లో కూడా తిలక్ వర్మ అంటే ఇష్టం మరింత పెరుగుతూ ఉంది.

Update: 2025-09-29 11:15 GMT

చాలా రోజుల తర్వాత భారత జట్టులో తెలుగోడు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉండడంతో తెలుగు ప్రజల్లో కూడా తిలక్ వర్మ అంటే ఇష్టం మరింత పెరుగుతూ ఉంది. నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ ఫైనల్ లో ఆడిన తీరుతో అతడికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఫైనల్ అభిషేక్‌ శర్మ, సూర్య, గిల్‌ విఫలమవ్వగా భారత్ ను గెలిపించే బాధ్యతను తిలక్ తన భుజాల మీద వేసుకున్నాడు. విజయం అందించి చూపించాడు. దాదాపు పది నెలల క్రితం. దక్షిణాఫ్రికా గడ్డపై తిలక్‌ వర్మ వరుసగా రెండు టి20ల్లో సెంచరీలు చేశాడు. ఆ తర్వాత భారత్‌కు రాగానే ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా మరో సెంచరీ కొట్టి టి20 క్రికెట్‌లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ కు విజయాన్ని దూరం చేసి భారత్ కు విజయ తిలకం దిద్దాడు మన తెలుగోడు. నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. చందాన‌గ‌ర్ పీజేఆర్ స్టేడియంలో కోచ్ స‌లాం దగ్గర శిక్ష‌ణ‌ తీసుకున్నాడు. తిలక్‌ వర్మ 2018-19 రంజీ ట్రోఫీలో హైద‌రాబాద్ త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అక్కడి నుండి తిలక్ వర్మ అంచలంచలుగా ఎదిగాడు.

Tags:    

Similar News