చెప్పులో దూరిన పాము.. టెకీ ప్రాణాలు పోయాయి

చెప్పులు, షూలు వేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ఏమైనా విష సర్పాలు, తేళ్లు లాంటివి దూరాయేమోనని ముందే చూసుకోవడం చాలా మంచిది.

Update: 2025-09-01 13:45 GMT

snake

చెప్పులు, షూలు వేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ఏమైనా విష సర్పాలు, తేళ్లు లాంటివి దూరాయేమోనని ముందే చూసుకోవడం చాలా మంచిది. అలా చెప్పులో చేరిన పాము కాటేయడం వలన రక్తపింజరి పాము పిల్ల కాటు వేయడంతో ఓ ఐటీ నిపుణుడు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులోని టీసీఎస్‌ కంపెనీలో పనిచేస్తున్న ప్రకాశ్‌ ఆనేకల్‌ తాలూకా బన్నేరుఘట్ట సమీపంలోని రంగనాథ లేఅవుట్లో నివసిస్తున్నారు. పనిపై బయటకు వెళ్తూ చెప్పులు వేసుకున్నారు. అందులో ఉన్న పాముపిల్ల అతని బొటనవేలిని కాటేసింది. మొదట్లో స్పర్శ తెలియలేదు. కాటు వేశాక సుమారు 45 నిమిషాలు పాము చెప్పులోనే ఉంది. చెప్పుల్ని విడిచిన తర్వాత అందులో పాము ఉందని వారింటికి వచ్చిన ఓ కార్మికుడు గుర్తించి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. అప్పటికే అస్వస్థతకు గురై మంచం మీద పడ్డ ప్రకాశ్‌ నోటినుంచి నురగ వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోగానే మరణించారు. ప్రకాష్ కు 2016లో జరిగిన ఓ ప్రమాదంలో కాలి స్పర్శ పూర్తిగా పోయింది. దీంతో తనకు పాము కరిచిన విషయం కూడా తెలియలేదని కుటుంబ సభ్యులు వాపోయారు.

Tags:    

Similar News