నిద్రపోయి 9.1 లక్షలు సంపాదించింది

నిద్రపోయి లక్షలు సంపాదించవచ్చని నిరూపించింది పుణెకు చెందిన ఓ యువతి.

Update: 2025-07-05 13:00 GMT

నిద్రపోయి లక్షలు సంపాదించవచ్చని నిరూపించింది పుణెకు చెందిన ఓ యువతి. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న పూజా మాధవ్ వావల్ ఏకంగా 9.1 లక్షల రూపాయలు నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు.

ప్రముఖ మ్యాట్రెస్ సంస్థ 'వేక్‌ఫిట్' నిర్వహించిన 'స్లీప్ ఇంటర్న్‌షిప్' నాలుగో సీజన్‌లో పూజ విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా వచ్చిన లక్షకు పైగా దరఖాస్తుల నుంచి 15 మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేశారు. వీరందరికీ 60 రోజుల పాటు రోజూ 9 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని చెప్పారు. వారి నిద్ర నాణ్యతను కాంటాక్ట్‌లెస్ స్లీప్ ట్రాకర్ల ద్వారా పర్యవేక్షించారు. అందరిలోకి అత్యుత్తమంగా, క్రమశిక్షణతో నిద్రపోయిన పూజా మాధవ్ 91.36 స్కోరుతో 'స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచారు. భారత్‌లో పెరుగుతున్న నిద్రలేమి సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేక్‌ఫిట్ సంస్థ తెలిపింది. ఈ పోటీలో పాల్గొన్న 15 మందికీ సంస్థ లక్ష రూపాయలు చొప్పున బహుమానం ఇచ్చింది.

Tags:    

Similar News