భారీగా భరణం షమీ ఇచ్చుకోవాల్సిందే!!

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ హసీన్ జహాన్, వారి కుమార్తెకు చెల్లించాల్సిన మధ్యంతర భరణాన్ని భారీగా పెంచుతూ కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Update: 2025-07-02 08:15 GMT

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ హసీన్ జహాన్, వారి కుమార్తెకు చెల్లించాల్సిన మధ్యంతర భరణాన్ని భారీగా పెంచుతూ కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

గతంలో అలీపూర్ సెషన్స్ కోర్టు తీర్పు ప్రకారం, హసీన్ జహాన్‌కు నెలకు 50 వేలు, కుమార్తెకు 80 వేలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించారు. అయితే ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, తన నెలవారీ ఖర్చులు సుమారు 6 లక్షలు ఉండగా, తన ఆదాయం కేవలం 16 వేల రూపాయలు మాత్రమేనని హసీన్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తనకు నెలకు 7 లక్షలు, కుమార్తెకు 3 లక్షల రూపాయల చొప్పున భరణం ఇప్పించాలని హసీన్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అజోయ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని ధర్మాసనం, అలీపూర్ కోర్టు నిర్ధారించిన భరణం మొత్తాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హసీన్ జహాన్‌కు ప్రతినెలా 1.5 లక్షల రూపాయలు, కుమార్తె సంరక్షణ, ఖర్చుల నిమిత్తం మరో రెండున్నర లక్షలు కలిపి మొత్తం 4 లక్షలు చెల్లించాలని షమీని ఆదేశించింది.

Tags:    

Similar News