బిరియానీ ప్లేట్ తో రచ్చ.. రెచ్చిపోయిన షమీ!!
భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీని బిర్యానీతో రెచ్చగొట్టిన విషయాన్ని మాజీ కోచ్ రవిశాస్త్రి పంచుకున్నాడు.
భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీని బిర్యానీతో రెచ్చగొట్టిన విషయాన్ని మాజీ కోచ్ రవిశాస్త్రి పంచుకున్నాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడి భారత్ సిరీస్ కోల్పోయింది. చివరి టెస్టులో మరో 100 పరుగులు మాత్రమే దక్షిణాఫ్రికా సాధించాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఇలాంటప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో షమీ ఒక పెద్ద ప్లేటు నిండుగా బిర్యానీ పెట్టుకొని తినేందుకు సిద్ధమయ్యాడు. నీ ఆకలి తీరుతుందా అని రవిశాస్త్రి అసహనాన్ని ప్రదర్శించగా షమీకి బాగా కోపం వచ్చింది.
రవిశాస్త్రి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను పక్కకు పిలిచి అతడిని ఒంటరిగా వదిలేయండి. ఏదైనా నాతో మాట్లాడాలంటే వికెట్లు తీసిన తర్వాత రమ్మనండని చెప్పాడు. షమీ వరుసగా వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా కుప్పకూలింది. 63 పరుగులతో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో షమీ 5 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ ముగిశాక అదే ప్లేట్‌ను ఇచ్చి ఇప్పుడు ఎంత బిర్యానీ కావాలో తిను అంటూ భరత్ అరుణ్ చెప్పారు.