సీనియర్ నటి నళిని.. గుడి ముందు భిక్షాటన చేస్తూ!!
సీనియర్ నటి నళిని చెన్నైలో భిక్షాటన చేశారు. తిరువేర్కడులో దేవి కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట కొంగుపట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేశారు.
సీనియర్ నటి నళిని చెన్నైలో భిక్షాటన చేశారు. తిరువేర్కడులో దేవి కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట కొంగుపట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేశారు. అమ్మవారు కలలో కనిపించి తనకోసం ఏం చేస్తావని అడిగిందని నళిని మీడియాతో చెప్పారు. అమ్మవారి కోసం ఏం చేయాలో తోచక ఇలా కొంగుపట్టి భిక్షం అడుగుతున్నానన్నారు. వచ్చిన కానుకలను, డబ్బును అమ్మవారికి కానుకగా సమర్పించానని చెప్పారు. 1981లో సినిమాల్లోకి అడుగుపెట్టారు నళిని. ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. సహాయనటిగా, విలన్‌గా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు.