విమానాలకు ఎయిర్ బ్యాగ్స్

విమాన ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించడానికి శాస్త్రవేత్తలు ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు.

Update: 2025-09-12 11:45 GMT

విమాన ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించడానికి శాస్త్రవేత్తలు ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కార్లకు ఎయిర్‌బ్యాగులు ఎలా తెరుచుకుంటాయో విమానాలకు కూడా ఎయిర్‌బ్యాగ్‌లతో రక్షణ కల్పించే టెక్నాలజీని ఇంజినీర్లు దర్శన్, ఎషెల్ వాసిమ్ తీసుకొచ్చారు. వీళ్లు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్ పిలానీకి చెందిన దుబాయ్ క్యాంపస్‌కు చెందినవారు. 'ప్రాజెక్ట్‌ రీబర్త్‌' పేరుతో దీన్ని తయారుచేశారు. జేమ్స్‌ డైసన్‌ అవార్డు కోసం ఈ ప్రాజెక్టు పోటీ పడుతోంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని, మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదుకే ఈ సాంకేతికతను అభివృద్ధి చేశామని ఆ ఇంజినీర్లు చెబుతున్నారు.

Tags:    

Similar News