చెట్లకు ప్రాణం పోసిన సత్తయ్య
మన ఊళ్ళల్లో ఎన్నో చెట్లను మనం పుట్టినప్పటి నుండి చూస్తుంటాం. వాటి నీడ కింద ఆడుకుని ఉంటాం.
మన ఊళ్ళల్లో ఎన్నో చెట్లను మనం పుట్టినప్పటి నుండి చూస్తుంటాం. వాటి నీడ కింద ఆడుకుని ఉంటాం. వాటి చుట్టూ ఎన్నో మధురస్మృతులు కూడా ఉంటాయి. అలాంటి చెట్లను నరికేస్తున్నారంటే మనకూ బాధ అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనను సత్తయ్య చూడలేకపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని రైతుల పొలాల్లో, తోటల్లోని సుమారు 20 నుంచి 25 ఏళ్ల వయసున్న రావి తదితర 15 చెట్లను నరికేయబోతున్నారని ఆయనకు తెలిసింది. ఆ చెట్లను రక్షించుకోవాలనుకున్నారు, హైదరాబాద్‌లోని వటా ఫౌండేషన్ రహదారులు, భవనాల నిర్మాణాల్లో భాగంగా తొలగించే మహా వృక్షాలను ఇతర ఖాళీ స్థలాల్లో నాటి బతికిస్తున్న విషయం తెలుసుకుని వారిని సంప్రదించారు. వారి సహకారంతో ఆ చెట్లను గ్రామంలో పలు చోట్ల నాటారు. వాటిలో 14 తిరిగి ప్రాణం పోసుకోవడం విశేషం