సమంత ఆగ్రహం వ్యక్తం చేసినా ఆపలేదు

సమంత రూత్ ప్రభు జిమ్ నుండి బయటకు వస్తున్నప్పుడు ముంబైలో ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు.

Update: 2025-06-18 10:45 GMT

సమంత రూత్ ప్రభు జిమ్ నుండి బయటకు వస్తున్నప్పుడు ముంబైలో ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. వారి ప్రవర్తనపై సమంత అసహనం వ్యక్తం చేసింది. సమంత రూత్ ప్రభు జిమ్ నుండి బయటకు రాగానే ఫోటోగ్రాఫర్లు వెంటబడ్డారు. ఆమె తన కార్ కోసం వెతుకుతూ ఉండగా ఆమెను చుట్టుముట్టేశారు. ఎంతో చిరాకుగా సమంత కనిపించింది. ఇక ఆపుతారా అంటూ సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది.

రోడ్డు దగ్గర పార్క్ చేసిన తన కారు సమంతకు కనిపించకపోవడంతో, ఆమె తిరిగి లోపలికి వెళ్లి మరో వైపు కారు దగ్గరకు చేరుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఆమె స్పోర్ట్స్ వేర్ ధరించి ఉంది. బాంద్రాలో జిమ్ పూర్తి చేసుకుని ఆమె తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News