రిటైర్మెంట్.. కోహ్లీ చెప్పిన గడ్డం స్టోరీ
ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ. తన రిటైర్మెంట్‌పై సరదాగా వ్యాఖ్యలు చేశాడు. గడ్డానికి రెండు రోజుల క్రితమే రంగు వేసుకున్నానని, ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి ఇలా గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తోందంటేనే మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలని విరాట్ కోహ్లీ తెలిపాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 123 టెస్టులు ఆడి, 46.85 సగటుతో 9230 పరుగులు సాధించాడు. 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు అతని పేరిట ఉన్నాయి.