లడ్డూ కావాలంటూ సీఎంకు రిక్వెస్ట్
మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేశ్ కుశ్వాహా అనే వ్యక్తి ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి తన సమస్య చెప్పుకున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేశ్ కుశ్వాహా అనే వ్యక్తి ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి తన సమస్య చెప్పుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు నవ్‌ధా గ్రామంలో నిర్వహించిన వేడుకలో రెండు లడ్డూలు కాకుండా ఒక లడ్డూనే పంచారని, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత గ్రామస్థులకు పంచడానికి కిలో లడ్డూలు కొని తెచ్చామని, అయితే కమలేశ్ మాత్రం వాటిని తీసుకోవడానికి అంగీకరించలేదని పంచాయతీ కార్యదర్శి చెప్పారు.