వచ్చేసింది ర్యాపిడ్ రాగి.. ఏడాదికి ఎన్నిసార్లంటే?

రాగి పంటలో సమూల మార్పులు రాబోతున్నాయని అనిపిస్తోంది. ఇక్రిశాట్‌ సంస్థ రాగులపై పరిశోధనలు చేసి ‘ర్యాపిడ్‌ రాగి’ పేరిట కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది.

Update: 2025-06-27 12:00 GMT

రాగి పంటలో సమూల మార్పులు రాబోతున్నాయని అనిపిస్తోంది. ఇక్రిశాట్‌ సంస్థ రాగులపై పరిశోధనలు చేసి ‘ర్యాపిడ్‌ రాగి’ పేరిట కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది. శనగలు, కందుల తర్వాత స్పీడ్‌ బ్రీడింగ్‌ విధానంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్లలోనే దీన్ని తయారు చేశారు. సాంప్రదాయిక రకాల కంటే ఎన్నో రెట్లు మేలైనదిగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లక్ష ఎకరాల్లో, తెలంగాణలో 13 వేల ఎకరాల్లో రాగి సాగవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలతో పంటకాలం 135 రోజులుగా ఉండడంతో ఏడాదికి రెండు పంటలు మాత్రమే సాధ్యమవుతున్నాయి. ఇక్రిశాట్‌ తీసుకొచ్చిన ర్యాపిడ్‌ రాగి పంట 68 రోజుల్లోనే చేతికొస్తుంది. దీంతో ఏడాదిలో 5 పంటలు పండించవచ్చు. విత్తనం వేసిన తర్వాత సత్వరమే మొలకెత్తుతుంది. తక్కువ పూతతో మొక్క వేగవంతంగా ఎదుగుతుంది. ఎక్కువ కాంతి, ఉష్ణోగ్రత, తేమను తట్టుకోవడంతోపాటు తక్కువ నీటితో సాగవుతుంది. ర్యాపిడ్‌ రాగి సాగుతో ఏడాదికి 75 నుంచి 100 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News