పరుగులో పుల్లయ్య పేరు
ఖమ్మంలో ఇంటెలిజెన్స్ ఎస్సైగా పనిచేస్తున్న సిరిపురపు పుల్లయ్య యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఖమ్మంలో ఇంటెలిజెన్స్ ఎస్సైగా పనిచేస్తున్న సిరిపురపు పుల్లయ్య యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్న ఆయన యువతకు దీటుగా 2 గంటల 15 నిమిషాల్లో 21 కిలో మీటర్ల హాఫ్ మారథాన్ పూర్తిచేశా రు. ఆదివారం ఆయన స్వగ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్లలో ఉదయం 6.30కు ఈ మారథాన్ ప్రారంభించి, 8.45కు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో పూర్తిచేశారు. 40 ఏళ్లపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. తన 53వ ఏట నుంచి మారథాన్‌లలో పాల్గొనడం ప్రారంభించారు. 150 పతకాలకు పైగా సాధించారు.