పేపర్ లో యాడ్ కు.. ప్రమాదానికి పోలిక పెడుతూ పోస్టులు

అహ్మదాబాద్‌లో జరిగిన దారుణ విమాన ప్రమాదం గురించి తెలియగానే ఓ న్యూస్‌పేపర్‌ యాడ్‌ చర్చకు వచ్చింది.

Update: 2025-06-14 09:00 GMT

అహ్మదాబాద్‌లో జరిగిన దారుణ విమాన ప్రమాదం గురించి తెలియగానే ఓ న్యూస్‌పేపర్‌ యాడ్‌ చర్చకు వచ్చింది. గుజరాత్‌లో బహుళ ప్రజాదరణ ఉన్న మిడ్‌ డేలో జూన్ 12 ఉదయం ఓ ప్రకటన ప్రచురించారు. ఫాదర్స్‌ డే ను పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకూ కిడ్‌జానియా అనే చిల్డ్రన్‌, ఫ్యామిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌లో నిర్వహించే గేమ్స్‌ గురించి ఆ ప్రకటన ఉంది. అందులో ఓ భవనంలోంచి ఎయిర్‌ ఇండియా విమానం బయటకు వస్తున్నట్లుగా ఉంటుంది.


కిడ్‌జానియాలో పిల్లలు ఏవియేషన్‌ థీమ్‌తో కూడిన గేమ్స్‌లో పైలట్లుగా ఆడుకోవచ్చు అన్నది ఈ యాడ్‌ సారాంశం. అహ్మదాబాద్‌లో సరిగ్గా యాడ్ లో ఉన్న విధంగా ఎయిరిండియా విమానం కూలిపోయి, ఓ భవనంలోంచి దాని శకలం దూసుకెళ్లటం చూసి అందరూ షాకయ్యారు. సోషల్‌ మీడియాలో మిడ్‌డే యాడ్‌ను, విమాన దుర్ఘటన ఫొటోలను కలిపి షేర్‌ చేశారు.

Tags:    

Similar News