వీధుల్లోకి పెంపుడు సింహం.. పరారైన ఓనర్లు

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో ఓ పెంపుడు సింహం వీధిలో వెళ్తున్న వారిపై దాడికి తెగబడింది.

Update: 2025-07-05 11:15 GMT

Pet lion

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో ఓ పెంపుడు సింహం వీధిలో వెళ్తున్న వారిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. లాహోర్‌లోని ఓ రద్దీ వీధిలో 11 నెలల వయసున్న పెంపుడు సింహం ఇంటి గోడ దూకి బయటకు వచ్చింది. ఆ సమయంలో షాపింగ్ చేసుకుని వస్తున్న ఓ మహిళను వెంబడించి, ఆమెపైకి దూకి కింద పడేసింది. అనంతరం ఆమెతో పాటు ఉన్న ఐదు, ఏడేళ్ల పిల్లలపై దాడి చేసింది. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం యజమానులు సింహంతో పాటు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కొన్ని గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సింహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఓ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో హోదా, అధికారానికి చిహ్నంగా సింహం వంటి వన్యప్రాణులను పెంచుకోవడం సర్వసాధారణంగా మారింది.

Tags:    

Similar News