పిల్లల కిడ్నీలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిందే!!
కిడ్నీలో రాళ్లు.. ఇది పెద్దలకే అని అనుకుంటూ ఉంటారు.
కిడ్నీలో రాళ్లు.. ఇది పెద్దలకే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో ఎంతో మంది పిల్లలు కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పిల్లలు మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. గత ఏడాది హైదరాబాద్ ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో 109 మంది పిల్లలకు సర్జరీ చేసి రాళ్లను తొలగించారని రికార్డులు చెబుతున్నారు. బాధితుల్లో ఐదు నెలల చిన్నారి నుంచి 17 ఏళ్ల వయసు పిల్లల వరకు ఉండటం ఆందోళన కలిగిస్తూ ఉంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పిల్లల్లోనూ ఈ సమస్య పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, నీరు తగినంత తాగుతున్నారా లేదా అనే విషయాన్ని కనిపెట్టుకుని ఉండాలని సూచిస్తున్నారు.