పంతులమ్మ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఉండగా.. వీడియో తీశారు
తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ రిలాక్స్డ్ గా కనిపించింది.
తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ రిలాక్స్డ్ గా కనిపించింది. క్లాస్ మొత్తం విద్యార్థులతో నిండి ఉండగా, పాఠాలు చెప్పడం మాని ఒక టీచర్ స్కూల్ లో తలకు నూనె పెట్టుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉంది. అంతేకాదు, స్పీకర్ ఆన్ చేసుకుని బాలీవుడ్ సినిమా పాటలు వింటూ ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి కర్రతో కొట్టినట్లు కూడా సదరు పంతులమ్మ మీద ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ వీడియో వైరల్ కావడంతో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. ఈమెనే ఈ స్కూల్ కు ప్రిన్సిపల్ కావడంతో ఆడింది ఆట.. చెప్పిందే పాఠం అన్నట్లు తయారైంది.