రోజుకు 54,794 పిడుగులు

2024–25లో భారతదేశంలో 2 కోట్లకుపైగా పిడుగులు పడ్డాయి.

Update: 2025-09-11 12:00 GMT

2024–25లో భారతదేశంలో 2 కోట్లకుపైగా పిడుగులు పడ్డాయి. అంటే రోజుకు సగటున 54 వేల 794. 2025–26లో జూలై 30 నాటికి దేశ వ్యాప్తంగా పిడుగుల వల్ల 1626 మంది ప్రజలు, 52వేల 367 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఒక డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగితే తేమ 7 శాతం పెరుగుతుంది. ఫలితంగా పిడుగులు 10 నుండి 12 శాతం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో వేసవికాలంలో భానుడి ప్రతాపం, అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతం వేడెక్కడం వంటివి కూడా పిడుగుల సంఖ్య పెరగడానికి కారణమవుతూ ఉన్నాయి.

Tags:    

Similar News