400కు 395 మార్కులు మన సింబా సత్తా
మాదకద్రవ్యాలను గుర్తించడంలో 'సింబా' సత్తా చాటింది.
మాదకద్రవ్యాలను గుర్తించడంలో 'సింబా' సత్తా చాటింది. 400 మార్కులకు గాను 395 మార్కులు సాధించి, వరంగల్‌లో జరిగిన రెండవ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. రామంగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సింబాను సత్కరించారు. ఆగస్టు 1-3 తేదీలలో వరంగల్‌లోని మామనూర్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో నిర్వహించిన డ్యూటీ మీట్‌లో, మాదకద్రవ్యాల ట్రాకింగ్ ఈవెంట్‌లో సింబా అగ్రస్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పూణేలో జరగనున్న జాతీయ పోలీసు డ్యూటీ మీట్‌లో సింబా సత్తా చాటనుంది. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన సింబా, మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందింది. 2021లో కాళేశ్వరం జోన్‌లోని రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్‌లో చేరింది.