ఒకప్పుడు మూడే పులులు.. మరిప్పుడు?

ఒకప్పుడు కేవలం మూడు పులులకు నిలయంగా ఉన్న తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఇప్పుడు 36 పులులు ఉన్నాయి.

Update: 2025-07-29 12:00 GMT

ఒకప్పుడు కేవలం మూడు పులులకు నిలయంగా ఉన్న తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఇప్పుడు 36 పులులు ఉన్నాయి. ఈ మార్పుకు కారణం ఓ సూపర్ మామ్. F6 అని పేరున్న ఫరా అనే ఆడ పులి 2019లో రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఫరా ఈ రిజర్వ్‌లో తిరుగులేని మాతృమూర్తిగా మారింది. ఆమె రక్తసంబంధం ఇప్పుడు టైగర్ రిజర్వ్‌లో నివసించే పులులలో దాదాపు సగం వరకు ఉంది. ఫరా పులుల జనాభాను పెంచడానికి చేసిన సహకారం అసాధారణమైనది. ఆమె మొత్తం నాలుగు సార్లు గర్భం దాల్చింది. 2025లో ఆమె కుటుంబంలోకి మరో మూడు పిల్లలు వచ్చాయి. ఫరా కుమార్తె F18 కు 2022లో నాలుగు పిల్లలు పుట్టాయి. F18 కు స్థానిక గిరిజన చెంచులు బౌరమ్మ అని పేరు పెట్టారు.

Tags:    

Similar News