ఇకపై చికెన్ షాపులకు లైసెన్స్

చికెన్ అమ్మాలంటే ఇకపై లైసెన్స్ ఉండాల్సింది.

Update: 2025-10-16 11:14 GMT

చికెన్ అమ్మాలంటే ఇకపై లైసెన్స్ ఉండాల్సింది. కొత్తగా లైసెన్సింగ్‌ విధానాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఏ పౌల్ట్రీ ఫారం నుంచి కోళ్లు వచ్చాయి, దుకాణదారుడు వాటిని ఎవరికి అమ్మారనే అంశాలను ట్రాక్‌ చేసేలా పకడ్బందీ వ్యవస్థను తీసుకురావాలని అధికారులు నిర్ణయించాయి. గుర్తింపు పొందిన చికెన్‌ షాపుల నుంచే హోటళ్ల నిర్వాహకులు మాంసం కొనేలా ప్రోత్సహించాలని, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించాలని అధికారులకు సూచించారు రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చంద్ర దండు ప్రకాష్‌నాయుడు. చికెన్‌ దుకాణాల వ్యర్థాలను తీసుకువెళ్లి చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టాలని, చికెన్‌ దుకాణాల వ్యర్థాలను సేకరించి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగని రీతిలో డిస్పోజ్‌ చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Tags:    

Similar News