ఏ కష్టమొచ్చినా.. ఇక అత్యవసర సేవలకు 112
ఎమర్జెన్సీ సేవలన్నింటికీ 112 నంబర్ కు డయల్ చేయాలని తెలంగాణ అధికారులు సూచించారు.
ఎమర్జెన్సీ సేవలన్నింటికీ 112 నంబర్ కు డయల్ చేయాలని తెలంగాణ అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 112 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్న ఎమర్జెన్సీ నంబర్ల స్థానంలో 112 ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా ఇదే అత్యవసర సేవల నంబర్‌గా కొనసాగుతుండగా తాజాగా తెలంగాణలోనూ అందుబాటులోకి తెచ్చారు. నేరాలు, అగ్నిప్రమాదాలు, రోడ్డుప్రమాదాలు, భౌతికదాడుల్లాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాల్లో బాధితులు ఈ నంబర్‌కు డయల్ చేసి ఆయా విభాగాల నుంచి సహాయం పొందేలా వ్యవస్థను రూపొందించారు.