నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోతో 20లక్షల మోసం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో రూపొందించిన ఏఐ వీడియోతో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు.

Update: 2025-06-18 09:45 GMT

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో రూపొందించిన ఏఐ వీడియోతో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహిళా వైద్యురాలి వాట్సాప్ కు కొద్ది నెలల క్రితం ఓ గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫేస్‌బుక్‌ లింక్‌ వచ్చింది. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో అధిక లాభాలు పొందేందుకు గొప్ప పథకం అంటూ నిర్మలా సీతారామన్‌ చెబుతున్న విధంగా ఉన్న వీడియో ఉంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి పెట్టుబడి పెట్టడం ఎలానో వివరించాడు.


తొలుత వైద్యురాలితో రూ.20వేలు పెట్టుబడి పెట్టించి మంచి లాభాలు వచ్చినట్లు అమెరికా డాలర్లలో చూపించాడు. ఆమెను నమ్మించి విడతల వారీగా 20 లక్షలా 13 వేలు డిపాజిట్లు చేయించారు. 68 లక్షలకు పైగా లాభం వచ్చినట్లుగా ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో చూపించింది. కానీ విత్‌డ్రా చేసుకోడానికి అవకాశం ఇవ్వడం లేదు. దీంతో మోసపోయానని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Tags:    

Similar News