నేపాల్‌ కొత్త 100 నోట్ భారత భూభాగాలతో

నేపాల్ మరోసారి భారత్ కు ఆగ్రహాన్ని తెచ్చే పని చేసింది. భారత్‌-నేపాల్‌ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్

Update: 2025-11-28 14:50 GMT

నేపాల్ మరోసారి భారత్ కు ఆగ్రహాన్ని తెచ్చే పని చేసింది. భారత్‌-నేపాల్‌ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలతో కూడిన మ్యాప్‌తో నేపాల్‌ కేంద్ర బ్యాంక్‌ కొత్త 100 రూపాయల నోట్లను విడుదల చేసింది. 2024 సంవత్సరంలో తయారైనట్లుగా చూపించిన ఈ కొత్త నోట్ల వెనుకవైపు మధ్య భాగంలో లేత ఆకుపచ్చ రంగుతో వివాదాస్పద నేపాల్‌ మ్యాప్‌ ఉంది. 2020లో సవరించిన మ్యాప్‌ను ప్రభుత్వం విడుదల చేయడంతో దానికి అనుగుణంగా కొత్త నోట్లను తాజాగా జారీ చేసినట్లు నేపాల్‌ కేంద్ర బ్యాంక్‌ అధికారులు వివరించారు. ఈ మూడు ప్రాంతాలు భారత్ కు చెందినవేనని గతంలో కూడా భారత్ స్పష్టం చేసింది.

Tags:    

Similar News