నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్.. వివాదాలు ఆగడం లేదాయె
నటి నయనతార జీవితంపై తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ వివాదాలకు కేంద్ర బిందువైంది.
నటి నయనతార జీవితంపై తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ డాక్యుమెంటరీపై తాజాగా మరో భారీ దావా నమోదైంది. ‘చంద్రముఖి’ సినిమాకి సంబంధించిన ఫుటేజీని అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ డాక్యుమెంటరీ నిర్మాతలపై, ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌పై 5 కోట్ల రూపాయల దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, డాక్యుమెంటరీ నిర్మాతలైన టార్క్ స్టూడియో ఎల్‌ఎల్‌పీకి, నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. చంద్రముఖి సినిమా ఆడియో, వీడియో హక్కులు తమ వద్దే ఉన్నాయని, యూట్యూబ్ నుంచి సేకరించిన క్లిప్స్‌ను తమ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో చట్టవిరుద్ధంగా ఉపయోగించారని ఏపీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.