దక్షిణాఫ్రికాకు నీరందిస్తున్న నల్గొండ గ్రామం
నల్గొండ జిల్లా చండూరు మండలం ఇటికూడ గ్రామం బోరు వాహనాలకు బాగా ఫేమస్.
నల్గొండ జిల్లా చండూరు మండలం ఇటికూడ గ్రామం బోరు వాహనాలకు బాగా ఫేమస్. ఈ గ్రామస్థులకు నలభై పైగా బోరు వేసే వాహనాలున్నాయి. అవన్నీ తెలుగు రాష్ట్రాలతో పాటు సమీప రాష్ట్రాల్లో బోర్లు వేస్తున్నాయి. ఈ గ్రామంలో 300కు పైగా ఇళ్లు ఉండగా.. ప్రతి ఇంట్లో ఒకరిద్దరూ ఈ వాహనాల ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అంతేకాదండోయ్ ఈ గ్రామస్థులకు చెందిన మరో 8 వాహనాలు దక్షిణాఫ్రికా దేశంలో బోర్లు తవ్వుతున్నాయి. మొదట గ్రామానికి చెందిన నల్ల నర్సింహ 1980లో బోరింగ్ బండిపై కార్మికుడిగా వెళ్లి ఆపరేటింగ్, డ్రైవింగ్ నేర్చుకుని 20 ఏళ్లు పనిచేశారు. తర్వాత సొంతంగా వాహనం కొన్నారు. ఆయన ప్రస్తుతం 6 వాహనాలను కొనుగోలు చేశారు. 2010లో దక్షిణాఫ్రికాకు ఓ వాహనాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఏకంగా 4 బండ్లను నడిపిస్తున్నారు.