సీట్‌ నెంబర్ 11Aలో మృత్యుంజయుడు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా బయపటడిన ప్రయాణికుడిని రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌గా గుర్తించారు.

Update: 2025-06-13 09:13 GMT

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా బయపటడిన ప్రయాణికుడిని రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌గా గుర్తించారు. 11ఏ నంబర్‌ సీటులో అతడు ప్రయాణించాడు. ప్రస్తుతం రమేశ్ కు చికిత్స అందుతోంది. గుజరాత్‌లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్‌ నుంచి విశ్వాస్‌ వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రమేశ్‌ విమానంలో 11ఏ సీటులో కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌ వెనుక ఈ సీటు ఉంటుంది.

రమేశ్‌కు ఛాతీ, కళ్లు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. విమానం కూలిపోయి దగ్ధమవుతుండగా గాయపడిన రమేశ్‌ అంబులెన్సు వైపు నడుచుకుంటూ వచ్చాడు. విమానంలో ఇతర ప్రయాణికుల పరిస్థితి గురించి స్థానికులు రమేశ్‌ను అడగడం కనిపించింది. విమానం పేలిపోయిందని గుజరాతీలో రమేశ్‌ చెప్పాడు.

Tags:    

Similar News