20 లక్షల బంగారు ఆభరణాలున్న పర్సును ఎత్తుకెళ్లిన కోతి
ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం వృందావన్‌లో ఓ మహిళ దగ్గర నుంచి కోతి సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలున్న పర్సును లాక్కెళ్లింది.
ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం వృందావన్‌లో ఓ మహిళ దగ్గర నుంచి కోతి సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలున్న పర్సును లాక్కెళ్లింది. యూపీలోని అలీఘర్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి ఠాకూర్ బాంకే బిహారీ ఆలయ దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ కోతి అభిషేక్ అగర్వాల్ భార్య చేతిలో ఉన్న పర్సును లాక్కెళ్లింది.
ఆ పర్సులో సుమారు
ఆ పర్సులో సుమారు 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. కోతి పర్సును లాక్కెళ్లిన వెంటనే స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొన్ని గంటల వెతుకులాట తర్వాత సమీపంలోని ఓ పొదలో పర్సును గుర్తించారు. అదృష్టవశాత్తూ, పర్సులోని ఆభరణాలు అన్నీ భద్రంగా ఉన్నాయి.