మిస్ యూనివర్స్ గా మాణికా విశ్వకర్మ

మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2025గా 22 ఏళ్ల మాణికా విశ్వకర్మ ఎన్నికయ్యారు.

Update: 2025-08-20 11:59 GMT

మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2025గా 22 ఏళ్ల మాణికా విశ్వకర్మ ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో థాయిలాండ్‌లో జరిగే మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారత్‌ తరపున ఆమె ప్రాతినిథ్యం వహిస్తారు. మాణికా విశ్వకర్మకు 2024 మిస్‌ యూనివర్స్‌ ఇండియా రియా సింఘా కిరీట ధారణ చేశారు. రాజస్థాన్‌లోని గంగానగర్‌ జిల్లా వాసి అయిన మాణికా తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కుటుంబం, సామాజిక వర్గం స్థిరమైన మద్దతే కారణమని తెలిపారు. పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం కంటే మహిళావిద్యకే తాను ఓటేస్తానన్నారు.

Tags:    

Similar News