మంత్రి రామ్మోహన్ నాయుడు వీడియో.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పై నెటిజన్స్ ఫైర్
విమాన ప్రమాద ఘటన తీరును ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఘోర విమాన ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ చేరుకున్నారు. విమాన ప్రమాద ఘటన తీరును ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ విషాద సమయంలో బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ ను మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు. అయితే ఆ వీడియోలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను యాడ్ చేయడంపై నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు. రీల్ మినిష్టర్ గా మారకండి అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.