అమ్మ చేత ఎంబీబీఎస్ చేయించింది
చదవాలన్న ఆసక్తి ఉంటే చాలు, అందుకు వయసు ఏ మాత్రం అడ్డుకాదు.
MBBS, mother,mbbs ,studies
చదవాలన్న ఆసక్తి ఉంటే చాలు, అందుకు వయసు ఏ మాత్రం అడ్డుకాదు. ఇప్పటికే పలువురు భావితరాలకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ తల్లి కూడా!! తమిళనాడుకు చెందిన 49 ఏళ్ల మహిళ కుమార్తె సహకారంతో చదివి ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. తెంకాశీ జిల్లాకు చెందిన అముదవల్లి అప్పట్లో ఇంటర్ పూర్తయ్యాక ఎంబీబీఎస్ చదవాలనుకున్నారు. కానీ ఫిజియోథెరపీ కోర్సు చేసి, ఎంబీబీఎస్ కు దూరమయ్యారు. ఇటీవల కుమార్తె సంయుక్త నీట్ కు సిద్ధమైంది. అయితే కుమార్తె సహకారంతో అముదవల్లి కూడా నీట్ రాశారు. అందులో ఆమెకు 147 మార్కులు వచ్చాయి. తమిళనాడులో వైద్యవిద్య ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరగ్గా అందులో ఆమెకు దివ్యాంగుల కేటగిరీలో విరుదునగర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో సీట్ లభించింది. సంయుక్తకు నీట్ లో 460 మార్కులు వచ్చాయి.