మంజీరా డ్యామ్‌కు పగుళ్లు రాలేదట!
మంజీరా డ్యామ్‌కు పగుళ్లు వచ్చాయన్న వార్తలు అవాస్తవమని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు.
మంజీరా డ్యామ్‌కు పగుళ్లు వచ్చాయన్న వార్తలు అవాస్తవమని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. ఆయన మంజీరా బ్యారేజీని ఆయన పరిశీలించారు. డ్యామ్‌కు పగుళ్లు వచ్చినట్టు సేఫ్టీ కమిటీ నివేదికలో లేదన్నారు. ఏటా చిన్న చిన్న మరమ్మతులు వస్తుంటాయని, డ్యామ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. బ్యారేజీ దిగువన అఫ్రాన్ దెబ్బతిన్నదని, మరమ్మతుల కోసం 3 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే పనులు చేపడతామని వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నివేదిక కూడా తమకు అందలేదని రాహుల్ బొజ్జా తెలిపారు. సింగూరు ప్రాజెక్టు ఆధునికీకరణ, కాల్వల పనులు కొనసాగుతాయని హామీ ఇచ్చారు.