లక్కున్న చిన్నది.. వజ్రం కాలికి తగిలింది

US woman Michelle Fox finds 2-carat white diamond worth ₹24 lakh at Arkansas State Park, plans to use it for her engagement ring.

Update: 2025-08-15 08:30 GMT

మిషెర్‌ ఫాక్స్‌ అనే మహిళకు ఊహించని అదృష్టం వరించింది. అమెరికాలో వజ్రాల వేటకు ప్రసిద్ధి చెందిన అర్కన్సాస్‌ స్టేట్‌ పార్క్‌లో 2 క్యారట్ల తెల్లటి వజ్రం ఆమె కాలికి తగిలింది. దీని విలువ సుమారు 24లక్షల రూపాయలు ఉండొచ్చని అంచనా. తన నిశ్చితార్థం కోసం ఆ వజ్రాన్ని పొదిగి ఓ ఉంగరం చేయించుకుంటానని మిషెర్‌ చెబుతోంది. 37 ఎకరాల విస్తీర్ణమున్న ఈ పార్కులో రోజుకు 15 డాలర్లు చెల్లించి ఎవరైనా వజ్రాలు అన్వేషించొచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఇక్కడ 350కి పైగా వజ్రాలు దొరికాయి. ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఈ పార్క్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు.

Tags:    

Similar News