మొబైల్ పోగొట్టుకున్నారా.. టెన్షన్ వద్దు!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర తప్పకుండా ఉండే వస్తువు అయిపోయింది.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర తప్పకుండా ఉండే వస్తువు అయిపోయింది. స్మార్ట్ ఫోన్‌లో డేటా, ఫొటోలు, బ్యాంకింగ్ అకౌంట్ డిటైల్స్ అన్నీ ఉంటాయి. అలాంటి స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే కలిగే బాధ అంతా ఇంతా కాదు. గతంలో పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి దొరికే అవకాశాలు చాలా తక్కువ.. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు.
ఒకవేళ మీరు మొబైల్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా తక్షణమే http://ceir.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు. అంతేకాకుండా మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా దుర్వినియోగం కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చని సూచించారు. మొబైల్ రికవరీ కోసం పూర్తి వివరాలను పొందుపరచాలని తెలిపారు.