ఫోన్ లోన్ కట్టకుంటే లాక్
క్రెడిట్‌పై మొబైల్ ఫోన్లు కొన్నాక ఆ రుణాన్ని తీర్చకుండా దాటవేస్తే ఆ ఫోన్లు పనికిరాకుండాపోయే అవకాశాలున్నాయి.
క్రెడిట్‌పై మొబైల్ ఫోన్లు కొన్నాక ఆ రుణాన్ని తీర్చకుండా దాటవేస్తే ఆ ఫోన్లు పనికిరాకుండాపోయే అవకాశాలున్నాయి. లోన్ ద్వారా మొబైల్స్ కొని, ఆ లోన్ ఎగవేతలకు పాల్పడుతున్నవారికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఓ ఆలోచన చేస్తోంది. లోన్ ద్వారా మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడే ఆ రుణం ఇచ్చే సంస్థలు సదరు ఫోన్లలో ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తాయి. రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించకపోతే మాత్రం ఆ యాప్ ద్వారా మీ రుణదాతలు ఫోన్‌ను లాక్ చేసేస్తారు. దీంతో దాన్ని ఇక మీరు వాడుకోలేరు. రుణదాతలతో సంప్రదించి ఆర్బీఐ ఓ తుది నిర్ణయానికి రానుంది.