అప్పు ఇవ్వనున్న గూగుల్ పే

గూగుల్ పే తో డబ్బులు పంపించుకోవడమే కాకుండా బిల్లులు కూడా చెల్లిస్తూ

Update: 2023-10-19 14:09 GMT

గూగుల్ పే తో డబ్బులు పంపించుకోవడమే కాకుండా బిల్లులు కూడా చెల్లిస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్ పే. గూగుల్ పే నుంచి ఇకపై లోన్స్ పొందవచ్చు. చిరు వ్యాపారులకు ఉపయోపడేలా గూగుల్ 'సాషే లోన్స్' ను ఇవ్వనుంది. ఇందుకోసం డీఎంఐ ఫైనాన్స్ తో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధానం ద్వారా చిరు వ్యాపారులకు రూ. 15 వేల వరకు రుణం అందిస్తుంది. ఈ రుణాన్ని నెలవారీగా చెల్లించవచ్చు. ఈఎంఐలుగా తక్కువ మొత్తంలో తిరిగి అప్పు చెల్లించవచ్చు. గూగుల్ పేలో చిరు వ్యాపారులు లోన్ పొందాలంటే వారి నెలవారీ ఆదాయం రూ. 30 వేల కంటే తక్కువ ఉండాలి. ఈ లోన్ ను పట్టణాల్లో వ్యాపారం చేసేవారితో పాటు గ్రామాల్లో వ్యాపారం చేసే వారికి కూడా ఇవ్వనున్నారు. చిరు వ్యాపారుల వర్కింగ్ కెపిటల్ అవసరాల కోసం క్రెడిట్ లైన్ ను గూగుల్ పే తీసుకుని వచ్చింది. అక్టోబర్ 19 నాడు జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2023 ఈవెంట్‌లో ఈ వివరాలను గూగుల్ సంస్థ తెలిపింది.

ఇక గూగుల్ పే ద్వారా జ‌రుగుతున్న మోసాల గురించి కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్ని అల‌ర్ట్ చేస్తున్న‌ట్లు గూగుల్ పే తెలిపింది. అనుమానిత లావాదేవీల‌పై ఆయా వ్య‌క్త‌ల‌కు వారి స్వంత భాష‌ల్లో అప్ర‌మ‌త్తం చేస్తున్నామ‌ని గూగుల్ తెలిపింది. ఫ్రాడ్ ప్ర‌య‌త్నాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అడ్డుకుంటున్నామ‌ని గూగుల్ చెప్పింది. ఏడాది కాలంలో సుమారు 12 వేల కోట్ల స్కామ్‌ను అడ్డుకున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.


Tags:    

Similar News