ఐరన్ డోమ్‌కు చిల్లు పడడంతో లైటెనింగ్ షీల్డ్ వచ్చేసింది

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి.

Update: 2025-06-18 10:45 GMT

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. గతంలో హమాస్‌, హెజ్‌బొల్లా దాడులను సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్‌ ఐరన్ డోమ్‌కు ఇరాన్‌ చిల్లు పెట్టింది. ఈ నేపథ్యంలో మరో అధునాతన రక్షణ వ్యవస్థ లైటెనింగ్ షీల్డ్ ను ఇజ్రాయెల్‌ రంగంలోకి దించింది.

ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను ‘ఐరన్‌ డోమ్‌’ పూర్తిగా అడ్డుకోలేకపోయింది. అందుకే బరాక్‌ మెగెన్‌ లేదా లైటెనింగ్ షీల్డ్ అని పిలిచే సరికొత్త రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్‌ ఉపయోగించడం మొదలుపెట్టింది. మధ్యదరా సముద్రం తీరంలోని ఇజ్రాయెల్‌ జలాల్లో వీటిని మోహరించింది. ‘బరాక్‌ మెగెన్‌’ అని పిలుచుకునే ఈ గగనతల రక్షణ వ్యవస్థకు హీబ్రూ భాషలో మెరుపు కవచం అని అర్థం. డ్రోన్లు, క్రూయిజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణుల దాడుల నుంచి తమ యుద్ధ నౌకలకు రక్షణ కల్పించేందుకు ఇజ్రాయెల్‌ ఈ వ్యవస్థను రూపొందించింది. అత్యాధునిక సార్‌-6 యుద్ధ నౌకలకు రక్షణగా ఈ వ్యవస్థను ప్రస్తుతం వినియోగిస్తోంది. ఒకేసారి వివిధ రకాల క్షిపణులను ప్రయోగించగలిగే స్మార్ట్‌ వర్టికల్‌ లాంచర్‌ సెట్‌ దీనికి అమరుస్తారు. స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి, సుదూర లక్ష్యాలను కూడా బరాక్‌ మెగెన్‌ ఛేదించగలదు. 360 డిగ్రీల కోణంలో ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించగలదు ఈ వ్యవస్థ.

Tags:    

Similar News