మంత్రి బంగ్లాలో చిరుత
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సురేశ్ సింగ్ రావత్ అధికారిక బంగ్లాలోకి ఓ చిరుతపులి చొరబడింది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సురేశ్ సింగ్ రావత్ అధికారిక బంగ్లాలోకి ఓ చిరుతపులి చొరబడింది. జైపూర్‌లోని సివిల్ లైన్స్ ఏరియాలోనే రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బంగ్లాలు ఉన్నాయి. మంత్రి రావత్ బంగ్లాకు ఎదురుగానే మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ నివాసం కూడా ఉంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన మంత్రి బంగ్లాకు చేరుకున్నారు. ప్రాంగణంలో చిరుత పాదముద్రలను గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ రెస్క్యూ బృందాలు, ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని భారీ గాలింపు చర్యలు చేపట్టాయి.