వీటిని ఖాళీ ప్రదేశాల్లో విసిరేస్తే చాలు

వీటిని చూస్తుంటే మీరు కొన్ని, కొన్ని వస్తువులు, వంటలు గుర్తుకు వస్తూ ఉండొచ్చు కానీ, ఇవి మన పర్యావరణానికి చేసే మేలు గురించి తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోక మానరు.

Update: 2025-07-21 12:42 GMT

వీటిని చూస్తుంటే మీరు కొన్ని, కొన్ని వస్తువులు, వంటలు గుర్తుకు వస్తూ ఉండొచ్చు కానీ, ఇవి మన పర్యావరణానికి చేసే మేలు గురించి తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోక మానరు. ఇవి ఏంటో తెలుసా సీడ్ బాల్స్. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమం కోసం ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. అయితే కాస్త కొత్తగా ఆలోచించిన జైళ్ల శాఖ తనవంతుగా లక్ష సీడ్‌ బాల్స్‌ ను తయారు చేయాలని నిర్ణయించింది. సెంట్రల్‌ జైలు, జిల్లా కారాగారాల్లోని ఖైదీలతో వీటిని తయారు చేయిస్తారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్‌ బంక్‌ల వద్ద వాటిని వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. చెట్లు లేని ఖాళీ ప్రదేశాల్లో వాటిని విసిరేయాలని వాహనదారులకు సూచిస్తారు. సీడ్ బాల్స్ తయారీకి ప్రయోగాత్మకంగా కరీంనగర్‌ జిల్లా కారాగారాన్ని ఎంపిక చేసి, ఖైదీలకు శిక్షణ ఇచ్చారు. నాణ్యమైన మట్టిని సేకరించి కానుగ, వేప, చింత తదితర మొక్కల విత్తనాలతో వీటిని తయారు చేయించారు. అలా మన పర్యావరణానికి ఈ బాల్స్ ఎంతో ఎంతో మేలు చేస్తాయి.

Tags:    

Similar News