భారత్ కు జావెలిన్ మిసైల్స్

భారత్‌-అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది.

Update: 2025-11-20 14:00 GMT

భారత్‌-అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. 93 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదించింది. అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ మన దేశానికి అందనుంది. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ మిసైల్‌ ట్యాంకులను కూడా పేల్చేయగలదు. జావెలిన్‌ మిసైల్ లో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్‌ లాంఛ్‌ ట్యూబ్‌, కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉంటాయి. దీనిని కంప్యూటర్‌తో నియంత్రిస్తూ ఉండడంతో క్షిపణిని ఎక్కడినుంచి ప్రయోగించారో శత్రువులకు అర్థం అవ్వదు. వీటిని అమెరికాకు చెందిన రక్షణరంగ దిగ్గజాలు రేథియాన్‌, లాక్‌హీడ్‌ మార్టీన్‌ సంస్థలు అభివృద్ధి చేశాయి.

Tags:    

Similar News