బంగ్లా మ్యాప్‌లో భారతదేశ రాష్ట్రాలు
బంగ్లాదేశ్ తాత్యాతిక ప్రధాని మహమ్మద్ యూనస్ మరోసారి భారత్ పై విషం చిమ్మాడు.
బంగ్లాదేశ్ తాత్యాతిక ప్రధాని మహమ్మద్ యూనస్ మరోసారి భారత్ పై విషం చిమ్మాడు. భారత్ కు చెందిన భూగాలను బంగ్లాదేశ్ కు చెందినదిగా చూపిస్తూ ఓ మ్యాప్ ను ప్రదర్శించారు. ఈ వివాదాస్పద మ్యాప్ ను పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహూకరించారు. అందులో భారత ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ లో భాగంగా ఉన్నాయి. పాకిస్థాన్ కు చెందిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ కమిటీ ఛైర్ పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్ లో పర్యటించారు. అతడికి యూనస్ ఓ పుస్తకాన్ని బహుకరించారు. ఆ బుక్ కవర్ పేజీపై ఉన్న బంగ్లాదేశ్ మ్యాప్ లో భారత్‌కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు అందులో కనిపించడం భారత ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది.