మిగ్-21 లకు గుడ్ బై చెప్పనున్న భారత ఆర్మీ
భారత వాయుసేనలో 60 ఏళ్లపాటు సేవలు అందించిన మిగ్-21 యుద్ధవిమానాలను సర్వీసు నుంచి పూర్తిగా ఉపసంహరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
భారత వాయుసేనలో 60 ఏళ్లపాటు సేవలు అందించిన మిగ్-21 యుద్ధవిమానాలను సర్వీసు నుంచి పూర్తిగా ఉపసంహరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 19న చండీగడ్లోని వైమానిక స్థావరంలో జరిగే ఒక కార్యక్రమంలో వీటి సేవలకు లాంఛనంగా స్వస్తి పలకనున్నారు. ఈ విమానాలు 1963లో తొలిసారి వాయుసేనలో చేరాయి. దాదాపు 850కు పైగా మిగ్‌లు వాయుసేనలో వివిధ దశల్లో సేవలు అందించాయి. వీటిల్లో 600 దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో తయారు చేశారు.భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్‌సోనిక్ ఫైటర్‌జెట్‌లుగా మిగ్-21లు నిలిచాయి. 1960-70ల్లో భారత్‌కు గగనతల యుద్ధంలో ఇవి అదనపు బలంగా మారాయి. ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ దీనిని దొంగిలించింది కూడా. మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ మార్క్-1ఎ’ను మోహరించాలని భారత వైమానిక దళం భావిస్తోంది.