హైదరాబాద్‌ ఐఐటీకి 7వ స్థానం

దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల జాబితాలో హైదరాబాద్‌ ఐఐటీ 7వ స్థానంలో నిలిచింది.

Update: 2025-09-05 11:25 GMT

దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల జాబితాలో హైదరాబాద్‌ ఐఐటీ 7వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌ కేటగిరీలోనూ 12వ ర్యాంకు సాధించింది. అత్యుత్తమ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల జాబితాలో వరుసగా పదోసారి, ఓవరాల్‌ కేటగిరీలో వరుసగా ఏడోసారి ఐఐటీ మద్రాస్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ‘ఇండియా ర్యాంకింగ్స్‌ 2025’ పేరిట కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ర్యాంకులను విడుదల చేశారు. ఓవరాల్‌ కేటగిరీలో దేశంలోని టాప్‌ 100 విద్యాసంస్థల్లో 24 రాష్ట్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు, 22 ప్రైవేటు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, 19 ఐఐటీలు, ఐఐఎస్సీలు, 9 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 8 నిట్‌ సంస్థలు, 5 వైద్య సంస్థలున్నాయి. అత్యుత్తమ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నిట్‌ వరంగల్‌ 28, కేఎల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ 35, ఐఐఐటీ హైదరాబాద్‌ 38, ఐఐటీ తిరుపతి 57వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌ కేటగిరీలో తెలుగు రాష్ట్రాల నుంచి హెచ్‌సీయూ 26, ఆంధ్రా యూనివర్సిటీ 41, కేఎల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ 46, ఉస్మానియా యూనివర్సిటీ 53, నిట్‌ వరంగల్‌ 63, ఐఐఐటీ హైదరాబాద్‌ 89వ స్థానాల్లో నిలిచాయి.

Tags:    

Similar News