సీట్ ఎగిరిపడ్డంతో బతికిపోయాను: మృత్యుంజయుడు
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్ మీడియాతో మాట్లాడారు.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్ మీడియాతో మాట్లాడారు. ప్రమాద తీవ్రత చూసి చనిపోయాననే అనుకున్నానని, బతికి బయటపడ్డానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు. విమానం ఎడమ వైపున ఉన్న ఎమర్జెన్సీ డోర్ పక్కన 11ఏ సీట్లో కూర్చున్నానని, టేకాఫైన కాసేపటికే విమానం కూలిపోయి ముక్కలైందన్నారు.
ఆ తాకిడికి తన సీట్ ఊడిపోగా, సీటు బెల్టు పెట్టుకుని ఉండటంతో సీటుతోపాటు ఎగిరిపడ్డానని విశ్వాస్ తెలిపారు. తాను పడ్డచోటు తక్కువ ఎత్తులో నేలకు చాలా దగ్గరగా ఉందన్నారు. ఎలాగైనా బయటపడగలనని అనుకుని వెంటనే సీట్ బెల్ట్ తీసేసి తలుపు నుండి బయటికొచ్చేశానన్నారు. తోటి ప్రయాణికులు, సిబ్బంది ఆక్రందనలు, వారి మృత్యుఘోష వెనక నుంచి వినిపిస్తూనే ఉన్నాయన్నారు.