అలా ఎలా తాగేస్తావ్ ఆయిల్ కుమార్

అతడి పేరు ఆయిల్ కుమార్.. అలాగని ఏదో ఆయిల్ షాపు పెట్టుకున్నాడని అనుకోకండి

Update: 2025-09-20 15:15 GMT

 Oil Kumar

అతడి పేరు ఆయిల్ కుమార్.. అలాగని ఏదో ఆయిల్ షాపు పెట్టుకున్నాడని అనుకోకండి. ఆయిల్ తాగడమే అతడి పని. అందుకే ఆ పేరు వచ్చింది. రోజుకు కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్, టీ మాత్రమే తాగుతూ ఉండడంతో అతడికి ఆయిల్‌ కుమార్‌ అనే పేరు పెట్టారు స్థానికులు. ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్యం రాలేదనీ, ఆసుపత్రికి వెళ్లలేదనీ తెలిపాడు కుమార్. 33 సంవత్సరాలుగా ఆయన తాగుతూనే ఉన్నారట. ఇలాంటి పదార్థాలను స్వీకరించడం వలన తీవ్రమైన అనారోగ్యం సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని, అంతర్గత రక్తస్రావం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Tags:    

Similar News